అమ్మ నాన్న చిన్నప్పుడే విడిపోయారు..సెల్లార్ లో పడుకునేవాడ్ని
on Apr 29, 2025
.webp)
జీవితం అందరికీ ఒకేలా ఉండదు. ఎన్ని కష్టాలు ఉంటాయో అన్ని విజయాలు కూడా ఉంటాయి. ఐతే ఎదిగే క్రమంలో వచ్చే కష్టాలు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఐతే నటుడు సమీర్ కూడా అలాంటి కష్టాలనే ఎదుర్కొన్నట్లు చెప్పాడు చిన్నప్పుడు. "స్టార్టింగ్ లైఫ్ లో నాకు అన్ని డౌన్స్ మాత్రమే ఉన్నాయి. వెంటనే ఎవరికీ అవకాశాలు రావు. మాది వైజాగ్. నేను ఇంటికి వెళ్ళేవాడిని. ఐతే నేను మా చుట్టాలింట్లో ఉండేవాడిని. ఎందుకంటే చిన్నప్పుడే మా అమ్మ నాన్న విడిపోయారు. మా చుట్టాలింట్లో నేను హాల్ లో కూర్చుని సినిమా చూస్తే ఉంటే చుట్టాలు వస్తున్నారంటూ నన్ను లోపలికి వెళ్లిపోవాలని చెప్పేవాళ్లు. ఒకవేళ చుట్టాలు వస్తే నేను ఎం చేస్తున్నాను అని అడిగితే చెప్పలేక వెళ్ళిపోమనేవాళ్ళు. తర్వాత చుట్టాలు వెళ్లిపోయిన విషయాన్ని కూడా చెప్పేవాళ్ళు కాదు.
వచ్చిన వాళ్లకు సినిమాలకు ట్రై చేస్తున్నాడు అని నా గురించి చెప్పడానికి నామోషీగా ఫీలయ్యేవాళ్ళు. ఫ్రెండ్స్ మనకు సపోర్ట్ చేస్తారు అంతే కానీ శత్రువులు మాత్రమే మనల్ని స్ట్రాంగ్ గా చేస్తారు. వాళ్ళ చిన్నచూపును నేను పట్టుదలగా తీసుకున్నాను. నేను కొంచెం సెట్ కావడానికి రెండు మూడేళ్లు పట్టింది. అలా టీవీలో ఛాన్సెస్ కోసం ట్రై చేసేవాడిని. ఆ ట్రై చేసే టైములో మా చుట్టాలు వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరే ఉండేవాడిని. ఐతే సీరియల్స్ షూటింగ్ ఎక్కువగా లేట్ నైట్స్ ఉంటాయి కదా అర్ధరాత్రి షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తే వాళ్ళు తలుపు తీసేవాళ్ళు కాదు. అప్పుడు కింద సెల్లార్ లో పడుకునే వాడిని. చాలా రోజులు అలా జరిగింది. నేను వాళ్లకు భారంగా మారిపోయానని తర్వాత తెలిసి ఇంట్లోంచి పంపించేశారు. బయట ఉండాలంటే రెంట్ కట్టాలి. డబ్బులు ఉండేవి కావు. ఏదో విధంగా డబ్బులు సంపాదించుకుని రెంట్ కట్టుకుని బయట ఉండడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి నో రిలేటివ్స్, అలా నేను ఇండస్ట్రీకి వచ్చి 29 ఏళ్ళు అయ్యింది. ఈ జర్నీలో 490 సినిమాలు చేసాను. ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి ఏంటంటే అరేయ్ మన చుట్టాలు వస్తున్నారు రాగలవా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు." అంటూ తన జీవితంలోని కష్టాలను చెప్పాడు. ఇక అష్షు ఐతే ఇది కదా సక్సెస్ అంటూ పొగిడేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



